మహేష్ పై క్రేజీ ఫ్లాష్ బ్యాక్ ?

Published on Sep 26, 2023 12:30 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు పై ఓ వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మహేష్ పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తాడని, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ నేపథ్యంలో వచ్చే ఈ ఫ్లాష్ బ్యాక్ భారీ యాక్షన్ తో సాగుతుందని తెలుస్తోంది. గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తోందని తెలుస్తోంది. పైగా ఈ కథలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా హైలైట్ గా ఉంటుందట.

ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా మ‌హేష్ కెరీర్లో 28వ సినిమాగా తెర‌కెక్కుతుంది. జ‌న‌వ‌రి 13, 2024న రిలీజ్ కానున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :