మెగాస్టార్ తో పోటీ పడిన లేడీ సూపర్ స్టార్ ?

Published on Jul 10, 2022 1:30 am IST

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా “గాడ్ ఫాదర్”. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార – చిరు కి మధ్య వచ్చే సీన్స్ వెరీ ఎమోషనల్ గా ఉంటాయని.. ఈ సీన్స్ లో నయనతార – చిరు పోటీ పడి నటించారట. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ కి అధికారిక రీమేక్ అయిన ఈ చిత్రంలో.. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్, సత్య దేవ్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా ఈ సినిమాని తెరకెక్కించాలని దర్శకుడు మోహన్ రాజా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. చిరు లుక్ అదిరిపోయింది.

సంబంధిత సమాచారం :