‘దేవర’లో మరో స్పెషల్ రోల్ ?

Published on Nov 20, 2023 10:00 am IST

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉందని.. ఈ పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని.. ఈ పాత్రలో సంజయ్ దత్ ను తీసుకున్నారని టాక్. దేవర సినిమాను దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ కిక్ ఇస్తోంది.

ఎంతైనా కొరటాల ఈ దేవర కథ కోసం చాలా నెలలు కసరత్తులు చేశాడు. మరి కథలో కొరటాల శివ ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. ఇక ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఈ సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :