‘స్పిరిట్’ పై మరో ఇంట్రెస్టింగ్ రూమర్ ?

‘స్పిరిట్’ పై మరో ఇంట్రెస్టింగ్ రూమర్ ?

Published on Oct 29, 2024 7:04 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే గాసిప్ వినిపిస్తోంది. ప్రభాస్ పాత్ర పోలీస్ అయినప్పటికీ, కథలో మలుపులు కారణంగా ప్రభాస్ పాత్ర గ్యాంగ్ స్టర్ గా మారుతుందని.. భారీ వైల్డ్ ఎలిమెంట్స్ సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. అలాగే, ఈ సినిమాలో ప్రభాస్ కి విలన్ గా మరో స్టార్ కూడా నటిస్తాడని టాక్.

కాగా ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌ తో ఈ సినిమా తెరకెక్కనుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు