రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది. ఒకప్పటి హీరోయిన్ శోభన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోందని.. ఆమె పాత్ర సినిమాలో ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా రవితేజ – శోభన పాత్రల మధ్య బాండింగ్ కూడా హైలైట్ గా ఉంటుందట.
ఇక ‘కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ ఇరుముడి. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. కొత్త ప్రయాణంలో ఉత్సాహంగా ఉన్నా’’ అని రవితేజ ఆ మధ్య చెప్పుకొచ్చారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తెగా నటిస్తోంది.
