ప్రభాస్ సలార్ పై క్రేజీ న్యూస్

Published on May 22, 2023 10:07 am IST

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ క్రేజ్ ప్రాజెక్ట్స్ లో ‘సలార్’ ఒకటి. కేజీఎఫ్ సినిమాతో వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా రెండు పార్ట్స్ చూసి నార్త్ మేకర్స్ సర్ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు ప్రభాస్ తో ‘సలార్’ మూవీని రెడీ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. కాగా ఈమూవీలో యాక్షన్ కేజీఎఫ్ సినిమాలో కంటే రెట్టింపు స్థాయిలో ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోందట. ఏకంగా 400 మంది రౌడీలతో ఈ క్లైమాక్స్ ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

పైగా ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లోనే ప్రభాస్ రెండో క్యారెక్టర్ కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవుతుందట. అందుకే, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వండర్స్ ని క్రియేట్ చేస్తుందని మేకర్స్ కూడా నమ్మకంగా ఉన్నారు. మొత్తమ్మీద ఈ పాన్ ఇండియా సినిమా పై అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. కాగా ఆ అంచనాలను అందుకోవడానికి మేకర్స్ కూడా భారీగా కసరత్తులు చేస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది.

సంబంధిత సమాచారం :