లేటెస్ట్..స్ట్రీమింగ్ కి రెడీ అయ్యిపోయిన “ఓరి దేవుడా”..!

లేటెస్ట్..స్ట్రీమింగ్ కి రెడీ అయ్యిపోయిన “ఓరి దేవుడా”..!

Published on Nov 10, 2022 1:30 PM IST

ఈ దీపావళి కానుకగా టాలీవుడ్ దగ్గర రిలీజ్ అయ్యినటువంటి చిత్రాల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రం “ఓరి దేవుడా” కూడా ఒకటి. వెంకీ మామ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అయితే యంగ్ దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అయితే విశ్వక్ కెరీర్ లో మరో మంచి హిట్ గా కూడా నిలిచింది. డీసెంట్ వసూళ్లు అందుకొని దీపావళిలో మంచి హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లో రిలీజ్ కి సిద్ధం అయ్యిపోయింది.

ఈ సినిమాని సొంతం చేసుకున్న మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి రెడీ అయ్యినట్టుగా మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేసేసారు. ఈ చిత్రం ఈ నవంబర్ 11 నుంచే ఆహా లో స్ట్రీమ్ కానున్నట్టుగా అధికారికంగా అనౌన్స్ చేసారు. దీనితో అయితే అప్పుడు మిస్ అయ్యిన వారు పెద్దగా వెయిట్ చెయ్యకుండానే వారికి అందుబాటులోకి వచ్చేయనుంది అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు