లేటెస్ట్..”విరూపాక్ష” ఓటీటీ డేట్ ఖరారు.!

Published on May 16, 2023 7:04 am IST

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన భారీ హిట్ చిత్రాల్లో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన చిత్రం “విరూపాక్ష” కూడా ఒకటి. మరి ఇప్పటికీ థియేటర్లు లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ చిత్రం అయితే ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ చిత్రాన్ని దిగ్గజ ఓటీటీ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా ఈ సినిమా అయితే ఇప్పుడు ఇందులో ఈ మే 21 నుంచి అందుబాటులో ఉండనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీనితో అయితే ఈ అవైటెడ్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా బివి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :