లేటెస్ట్ : డబుల్ స్పీడ్ తో దూసుకెళ్లనున్న పవన్ కళ్యాణ్

Published on Mar 27, 2023 8:18 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ తో హరిహర వీరమల్లు అలానే సముద్రఖని తో వినోదయ సిత్తం మూవీ రీమేక్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా వినోదయ సిత్తం రీమేక్ మూవీని జులై 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక వీటి తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అలానే సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓజి సినిమాలు చేయనున్నారు పవన్ కళ్యాణ్.

అయితే విషయం ఏమిటంటే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ప్రస్తుతం ఉస్తాద్ కి సంబంధించి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఒక భారీ సెట్టింగ్ సిద్ధం చేస్తుండగా ఈ సెట్ లో పదిరోజుల పాటు షూటింగ్ ఏప్రిల్ మొదటి వారం నుండి జరుపనున్నారట. అలానే అటు సుజిత్ ఓజి మూవీని కూడా ఏప్రిల్ లో ప్రారంభించనుండగా ముందుగా పవన్ లేని సీన్స్ ని చిత్రీకరించనున్నారని, ఆ తరువాత మే లో పవన్ షూట్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. మొత్తంగా ఈ రెండు సినిమాల షూట్స్ తో డబుల్ స్పీడ్ తో దూసుకెళ్లనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

సంబంధిత సమాచారం :