లేటెస్ట్ : పవన్ – సాయి తేజ్ ల ‘బ్రో’ ఓటిటి పార్ట్నర్ ఫిక్స్

Published on May 18, 2023 9:05 pm IST

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ప్రస్తుతం సముద్రఖని తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ బ్రో. ఈ మూవీ యొక్క టైటిల్ ని కొద్దిసేపటి క్రితం మేకర్స్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఈ పోస్టర్ లో పవర్ఫుల్ లుక్ లో పవన్ కళ్యాణ్ అదరగొట్టగా, థమన్ అదిరిపోయే రేంజ్ బీజీఎమ్ మూవీ పై అందరిలో విపరీతమైన క్రేజ్ ని ఏర్పరిచింది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం సహా మరికొందరు నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. విషయం ఏమిటంటే ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్లు మనకు మోషన్ పోస్టర్ లో చూడవచ్చు. మొత్తంగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈ మూవీని జులై 28న గ్రాండ్ లెవెల్లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :