లేటెస్ట్.. ‘పెద్ది’ నెక్స్ట్ సాంగ్ కి డేట్, వేదిక ఫిక్స్.. గ్రాండ్ ఈవెంట్ తో స్పెషల్ సాంగ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది నుంచి ఇక వరుస అప్డేట్స్ ని మేకర్స్ స్టార్ట్ చేశారు. ఇటీవలే ట్రైలర్ డేట్ ని లాక్ చేసిన మేకర్స్ తాజాగా ముంబైలో ఈవెంట్ తో దీనిని లాంచ్ చేస్తున్నట్టుగా సాలిడ్ ప్రోమోతో అప్డేట్ అందించారు. ఇక దీనితో పాటుగా నెక్స్ట్ అప్డేట్ గా సినిమా నుంచి స్పెషల్ సాంగ్ గా మూడో పాటని ఖరారు చేశారు.

అంతే కాకుండా ఈ మే 23న ఆ సాంగ్ ని విడుదల చేస్తున్నట్టు బిగ్ అప్డేట్ ని అందించి వేదికగా భోపాల్ ని నిర్ణయించారు. దీనిపై వదిలిన కొత్త ప్రోమో కూడా ఇపుడు అభిమానులని, ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సో ఈ స్పెషల్ సాంగ్ లాంచ్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలానే స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ కనిపించనుండగా జూన్ 4న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.

Exit mobile version