“మహేష్ 28” సెట్స్ నుంచి వైరల్ గా మారిన లేటెస్ట్ పిక్.!

Published on Mar 18, 2023 2:00 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే మరియు శ్రీ లీల లు హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు మహేష్ కెరీర్ లో ఏ సినిమాకి పెట్టనంత భారీ బడ్జెట్ మరియు భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో అయితే ఈ సినిమాని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ సినిమా సెట్స్ నుంచి ఓ సూపర్ కూల్ పిక్ అయితే ఒకటి బయటకి వచ్చి వైరల్ గా మారింది. ఇందులో మహేష్ సూపర్ స్లిమ్ గా మరియు మంచి హ్యాండ్సమ్ గా కనిపిస్తుండగా తనతో పాటుగా త్రివిక్రమ్ మరియు నటుడు జైరాం కూడా కనిపించారు. దీంతో ఈ ఇంట్రెస్టింగ్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు మహేష్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :