లేటెస్ట్ పిక్స్ : నాని ‘దసరా’ టీమ్ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్

Published on Mar 31, 2023 2:10 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా బ్యూటిఫుల్ నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా యువ దర్శకడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ డ్రామా మూవీ దసరా. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ పాన్ ఇండియన్ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి అందించిన ఈ మూవీ నేడు పలు భాషల్లో థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇక తొలిఆట నుండే అటు నాని ఫ్యాన్స్ తో పాటు ఇటు నార్మల్ ఆడియన్స్ నుండి కూడా దసరా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడం విశేషం.

ముఖ్యంగా ధరణి పాత్రలో నాని అలానే వెన్నెల పాత్రలో కీర్తి ఇద్దరూ కూడా మాస్ స్టైల్ యాక్టింగ్ తో అదరగొట్టడంతో పాటు భారీ యాక్షన్ సీన్స్, గ్రాండియర్ విజువల్స్, మాస్ ఫైట్స్, డైలాగ్స్, దర్శకడు శ్రీకాంత్ సినిమాని ఆద్యంతం ఆకట్టుకునే రీతిన కథ, కథనాలను నడిపిన తీరుపై అందరి నుండి మంచి ప్రసంశలు కురుస్తున్నాయి. మొత్తంగా దసరా మూవీ సూపర్ గా టాక్ ని సొంతం చేసుకోవడంతో నేడు కొద్దిసేపటి క్రితం యూనిట్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నేడు శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన తమ మూవీ పై ఫ్యాన్స్, ఆడియన్స్ చూపిస్తున్న ఆదరణకు ప్రత్యేకంగా హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్ అమితానందం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. కాగా దసరా టీమ్ సక్సెస్ సెలబ్రేషన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :