లేటెస్ట్ పిక్స్ : స్టైలిష్ లుక్ లో మాస్ మహారాజా రవితేజ

Published on May 22, 2023 6:30 pm IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం యువ దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుండగా నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 20న ఈ మూవీ పలు భాషల్లో విడుదల కానుంది.

విషయం ఏమిటంటే, తాజగా విదేశాల్లో ఉన్న మాస్ మహారాజా రవితేజ ఫుల్ గడ్డం, క్రాఫ్ తో క్యాప్ పెట్టుకుని ఉన్న ఒక రెండు స్టైలిష్ లుక్ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో నేడు పోస్ట్ చేసారు. ఈ పిక్స్ లో రవితేజ ని చూస్తుంటే తన నెక్స్ట్ మూవీ కోసం ఈ లుక్ మెయింటెయిన్ చేస్తున్నట్లు కొంత అర్ధం అవుతోంది. కాగా ఈ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :