లేటెస్ట్ పిక్స్ : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Published on Sep 14, 2023 1:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈమూవీ తమిళ సూపర్ హిట్ తేరి కి రీమేక్ గా తెరకెక్కుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తుండగా దీనిని మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు హరీష్ శంకర్.

ఇక ఇటీవల కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ నేటి నుండి ప్రారంభం కాగా, ప్రస్తుతం మూవీకి సంబంధించి ఈ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ ని వేగంగా పూర్తి చేయనున్నారు. ఇక ఈ షెడ్యూల్ లో పవర్ స్టార్ క్యారెక్టర్ యొక్క తాజా పిక్స్ ని మేకర్స్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా కీలక పాత్రల్లో అశుతోష్ రానా, నవాబ్ షా, బిఎస్ అవినాష్, గౌతమి, చమ్మక్ చంద్ర, గిరి, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు నటిస్తున్నారు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :