లేటెస్ట్ పిక్స్ : విజయ్ దేవరకొండ ఫ్యామిలీ వినాయక చవితి సెలబ్రేషన్స్

Published on Sep 20, 2023 12:00 am IST

యువ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల సమంత తో కలిసి నటించిన మూవీ ఖుషి. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై నాగవంశీ, సాయి సౌజన్య ఈమూవీని నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇక ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా తన సినీ, వ్యక్తిగత విషయాలు ఫ్యాన్స్ తో పంచుకునే విజయ్ దేవరకొండ తాజాగా తమ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకల పిక్స్ ని సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో పోస్ట్ చేసారు. కుటుంబంతో కలిసి వినాయక చవితి వేడుక జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ తన తల్లి, తండ్రి, సోదరుడితో కలిసి దిగిన పిక్స్ ని విజయ్ పోస్ట్ చేసారు. కాగా ఆయన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :