లేటెస్ట్..రౌడీ హీరోకి పూజా హెగ్డే ఫిక్సేనట.!

Published on May 15, 2022 2:55 am IST

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “లైగర్” షూటింగ్ కంప్లీట్ అయ్యి సినిమా రిలీజ్ కి కూడా సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. మరి భారీ లెవెల్లో పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ తోనే విజయ్ దేవరకొండ అందులోని పూరి డ్రీం ప్రాజెక్ట్ జనగణమణ చెయ్యబోతున్నాడు.

ఇది కూడా కొన్ని వారాల కితమే అనౌన్స్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం పూజా హెగ్డే ఫిక్స్ అనే మాట నిజమేనట. దీనిపై త్వరలోనే అధికారిక అప్డేట్ కూడా రానున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనుండగా భారత్ ఆర్మీ నేపథ్యంలో వస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :