“మహేష్ 28” పై ఇంట్రెస్టింగ్ ప్రోగ్రెస్.!

Published on May 18, 2023 6:00 pm IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే మరియు శ్రీ లీల లు హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్ 28వ సినిమాగా అలాగే మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో భారీ హైప్ దీనిపై నెలకొంది. ఇక గత కొన్ని రోజులు నుంచి అయితే ఈ సినిమా టైటిల్ ఏంటి అనే చర్చే ఓ రేంజ్ లో కొనసాగుతూ ఉండగా ఈ టైటిల్ పై అయితే ఇంట్రెస్టింగ్ ప్రోగ్రెస్ తెలుస్తుంది.

ప్రస్తుతానికి మేకర్స్ చాలానే టైటిల్స్ అనుకుంటున్నప్పటికీ ఏది ఇంకా ఫైనల్ చేయలేదట. అయితే ఈ టైటిల్ ని మహేష్ తో కూడా కలిసి కూర్చొని దర్శకుడు అండ్ టీం కలిసి ఓ టైటిల్ ని మహేష్ కి నచ్చింది ఏదైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో దానిని లాక్ చేయనున్నారట. దీనితో ఈ టైటిల్ విషయంలో ఫైనల్ డెసిషన్ మహేష్ తో మీట్ తర్వాత అయితే ఉంటుంది అని లేటెస్ట్ టాక్.

సంబంధిత సమాచారం :