నన్ను భరించావా? నటించావా’.. ప్రియాంక సూటి ప్రశ్న !

Published on Dec 12, 2021 11:08 pm IST

అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ ఎట్టకేలకు తుది దశకు చేరుకునే సమయం ఆసన్నమైంది. ఆఖరి ఫన్‌ డేలో భాగంగా నాగార్జున ఈ రోజు సాయంత్రం ఆరుగురి ఇంటి సభ్యులతో సరదాగా గేమ్స్ ఆడిస్తూ.. మొత్తానికి కంటెస్టెంట్స్‌ లో జోష్ పెంచాడు. ముఖ్యంగా కంటెస్టెంట్స్‌ అందరికీ కొన్ని చిటీలు ఇచ్చాడు. ఆ చిటీల్లో ఉన్న పాటను సైగలు చేసి ఇతర ఇంటి సభ్యులకు తెలియజేయాలి. ఇది గేమ్ రూల్.

అయితే, ఈ గేమ్‌లో సన్నీ, మానస్‌, షణ్ముఖ్‌.. సైగల ద్వారా చెప్పడానికి తెగ ఇబ్బంది పడటం ప్రేక్షకులను అలరించింది. ఇక సిరి సునాయాసంగా ఈ గేమ్ లో గెలుపొందింది. అనంతరం ఇంటి నుంచి వెళ్లిపోయిన హౌస్‌ మేట్స్‌, కంటెస్టెంట్స్‌ ను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు. ‘హౌస్‌లో నన్ను భరించావా? నటించావా’ అని మానస్‌ ను ప్రియాంక అడిగింది. ఇక ‘టికెట్‌ టు ఫినాలే’ గెలుచుకొని శ్రీరామ్ నేరుగా టాప్‌ ఫైవ్‌ లో నిలిచిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :