“పుష్ప” పార్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా.?

Published on Sep 11, 2021 5:04 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా అప్ గ్రేడ్ చేస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ పాన్ ఇండియన్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండడమే కాకుండా భారీ అంచనాలు కూడా నెలకొల్పుకుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మొదటి భాగాన్ని మేకర్స్ ఈ ఏడాదిలోనే వచ్చే డిసెంబర్ నెల క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే తేదీ ఏమిటి అన్నది ఇంకా డిసైడ్ కాలేదు కానీ ఆ మాధ్య మాత్రం రెండు తేదీలు వినిపించాయి. ఒకటి డిసెంబర్ 17 కాగా మరొకటి మరొకటి డిసెంబర్ 24 అని తెలిసింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం మేకర్స్ ఈ సినిమాని డిసెంబర్ 17 కి ఫిక్స్ చెయ్యాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఎలాగో సినిమా అవుట్ పుట్ మరియు కంటెంట్ పై చాలా నమ్మకంగా ఉన్న వీరు ఒక వారం ముంచే రిలీజ్ చేస్తే లాంగ్ రన్ లో మరింత స్ట్రాంగ్ గా నిలుస్తుందని భావంలో ఉన్నారు కాబోలు. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో రష్మికా హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :