లేటెస్ట్..”చరణ్ 15″ పై ఈ అంశంలో హెచ్చరిస్తున్న మేకర్స్.!

Published on Jul 24, 2022 12:08 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇండియా జేమ్స్ కేమరూన్ శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం భారీ షెడ్యూల్స్ తో షూటింగ్ శరవేగంగా అనేక ప్రాంతాల్లో జరుగుతుండగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక ఊహించని అనౌన్సమెంట్ ని అయితే అందించారు. గత కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమాకి గాను..

ఆడిషన్స్ ని నటీనటులు ఎంపిక అయ్యారని కొందరికి ఎవరో సంప్రదింపులు చేస్తున్నారని తమకి తెలిసింది అని అయితే ఇందులో అసలు నిజం ఏమిటంటే తన యూనిట్ నుంచి అలాంటివి ఏమి చెయ్యలేదని సోషల్ మీడియాలో ఎవరికైనా అలా సంప్రదింపులు వస్తే నమ్మవద్దని ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి దిల్ రాజు అండ్ టీం తెలియజేసారు.

సంబంధిత సమాచారం :