‘హను-మాన్’ టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు !

‘హను-మాన్’ టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు !

Published on Nov 7, 2022 12:00 PM IST

చాలా కాలం తర్వాత, ప్రశాంత్ వర్మ కొత్త చిత్రం ‘హను-మాన్’ నుంచి లేటెస్ట్ అప్‌ డేట్‌ వచ్చింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ – అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో వినయ్ రాయ్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక హను-మాన్ టీజర్ ను ఈ నెల నవంబర్ 15 న విడుదల కానుందని ప్రకటిస్తూ ప్రశాంత్ వర్మ కొత్త పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. అలాగే సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం అని క్లారిటీ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. టీజర్‌ రిలీజ్ రోజు విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. అన్నట్టు తేజ సజ్జ తో ఆల్రెడీ “జాంబీ రెడ్డి” అనే కొత్త జానర్ సినిమా తీసి ప్రశాంత్ వర్మ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు