“చరణ్ 15” విషయంలో నిరాశగా ఫ్యాన్స్.?

“చరణ్ 15” విషయంలో నిరాశగా ఫ్యాన్స్.?

Published on Dec 17, 2022 9:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మావెరిక్ దర్శకుడు శంకర్ మరియు రామ్ చరణ్ ల కెరీర్ లో బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ 15వ సినిమాగా ఇది వస్తుండగా దీనిపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరికి వచ్చింది కానీ ఇప్పుడు నుంచి అయితే షూటింగ్ చాలా నెమ్మదిగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. శంకర్ హెట్ స్పీడ్ తో ఈ సినిమా కంప్లీట్ చేస్తూ ఉండడంతో పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉండేవి కానీ రీసెంట్ గా అయితే ఈ సినిమాపై ఏదైనా అప్డేట్ వినిపించి చాలా కాలం అయ్యింది.

ఇక దీనితో పాటుగా మరో రూమర్స్ కూడా సినిమా ఫస్ట్ లుక్ పై వినిపిస్తున్నాయి. కానీ ఇవి అయితే అవాస్తవం అని తెలుస్తుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ ఈ డిసెంబర్ 31న వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది. మరి మళ్ళీ ఈ సినిమా అప్డేట్స్ కోసం అయితే చరణ్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు