టాక్..”సలార్” రిలీజ్ పై కూడా లేటెస్ట్ రూమర్స్.!

టాక్..”సలార్” రిలీజ్ పై కూడా లేటెస్ట్ రూమర్స్.!

Published on Nov 30, 2022 8:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా మాస్ అండ్ సెన్సేషనల్ చిత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై అయితే అనేక అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతుండగా మేకర్స్ ఐటీ ఆల్రెడీ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ కి ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ చిత్రంపై కూడా రిలీజ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.

రీసెంట్ గానే ఆదిపురుష్ రిలీజ్ పై కూడా రాగా ప్రస్తుతానికి అయితే ఇవి నిజం కాదనే తెలిసింది. అలాగే ఇప్పుడు సలార్ కూడా వచ్చే ఏడాది కాకుండా 2024 రిలీజ్ అంటూ కొన్ని రూమర్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మరి వీటిలో కూడా ఎలాంటి నిజం లేదనే తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ అవైటెడ్ సినిమాలో అయితే పృథ్వీ రాజ్, జగపతిబాబు తదితరులు నటిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు