లేటెస్ట్..ఓటిటిలో “సర్కారు వారి పాట” నాన్ రెంట్ స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్.!

Published on Jun 4, 2022 10:01 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ అండ్ సోషల్ డ్రామా మహేష్ కెరీర్ లో మరి మంచి హిట్ గా నిలిచింది. అయితే థియేటర్స్ లో ఇప్పటికీ మంచి రన్ కొనసాగిస్తున్న ఈ చిత్రం రీసెంట్ గానే ప్రముఖ ఓటిటి యాప్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. కాకపోతే రెంటల్ గా పే చేసి చూసే వెసులుబాటుతో తెచ్చారు.

అయితే మరి నాన్ రెంటల్ గా ఎప్పుడు నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తారో అనేది కన్ఫర్మ్ అయ్యింది. ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియో వారు ఈ జూన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ నాన్ రెంటల్ గా తీసుకురాబోతున్నారట. ఒకవేళ ఎర్లీగా వద్దు అనుకుంటే అప్పటి వరకు వీక్షకులు ఆగాల్సి ఉంటుంది. లేకపోతే రెంటల్ గా చూడొచ్చు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :