లేటెస్ట్ : ‘డన్కి’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన షారుఖ్ ఖాన్

Published on Sep 27, 2023 8:30 pm IST

ఇటీవల పఠాన్, జవాన్ మూవీస్ తో రెండు వరుస బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుని కెరీర్ పరంగా మంచి జోరు మీద ఉన్నారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఇక తాజాగా ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తో కలిసి చాలా గ్యాప్ తరువాత షారుఖ్ ఖాన్ చేస్తోన్న కామెడీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ డన్కి. ఈ మూవీ పై షారుఖ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానున్నట్లు ఇటీవల షారుఖ్ ఖాన్ వెల్లడించారు. కాగా ఈ మూవీ పోస్ట్ పోన్ కానుందని నిన్నటి నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో నేడు షారుఖ్ ని ఈ విషయమై ఒక అభిమాని ట్విట్టర్ లో అడిగారు. దానికి రిప్లై ఇచ్చిన షారుఖ్, ఖచ్చితంగా డన్కి రిలీజ్ డేట్ లో ఎటువంటి మార్పు ఉండబోదని మరోసారి క్లారిటీ ఇచ్చారు బాద్షా. అలానే ఈ మూవీ రొమాంటిక్, యాక్షన్ తో పాటు ఎమోషనల్ గా కూడా మీ అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు.

సంబంధిత సమాచారం :