రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ఐతే, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆసక్తికరమైన వార్తలతో మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ పాత్ర పై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లో ఇంటర్వెల్ ను షూట్ చేస్తారట.
కాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. ఇప్పటికే, లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
