‘శ్యామ్ సింఘ రాయ్’ రిలీజ్ కి రెడీ !

Published on Oct 18, 2021 11:24 am IST

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింఘ రాయ్’. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 24 న విడుదల చేయబోతున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ పోస్టర్స్ కు ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది.

కాగా ఈ సినిమా కథ ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా వుంటుందట. ఈ సినిమా పై జనాల్లో కూడా బాగా ఆసక్తి ఉంది. ఇక సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ కూడా ఈ సినిమాలో వినూత్నంగా ఉండబోతుందట. నాని మొదటి నుండి ప్రేక్షకులకు కాస్త వైవిధ్యమైన కథలు చెప్పడానికి.. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు

సంబంధిత సమాచారం :

More