నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి మరో సాలిడ్ అనౌన్సమెంట్.!

Published on Jul 5, 2022 12:40 pm IST

నందమూరి వారి యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి ఇప్పుడు తన కెరీర్ లోనే ఒక ఊహించని లైనప్ తో వస్తున్నాడని చెప్పాలి. లేటెస్ట్ గా అయితే “బింబిసార” ట్రైలర్ తో ఎనలేని అంచనాలు హైప్ ని రేపిన కళ్యాణ్ రామ్ నెక్స్ట్ కూడా పలు భారీ సినిమాలతో సిద్ధంగా ఉన్నాడు. మరి ఇప్పుడు కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా నందమూరి అభిమానులు సహా సినీ ప్రముఖులు అతడికి విషెష్ తెలియజేస్తుండగా..

ఇప్పుడు తన నుంచి మరో ప్రాజెక్ట్ పై అనౌన్సమెంట్ వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో తన కెరీర్ లో 19వ సినిమాని టేకప్ చేసినట్టుగా ఇప్పుడు సాలిడ్ అనౌన్మెంట్ వచ్చింది. మరి ఒక ప్రీ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయగా దీనితో పాటుగా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని అతి త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మరి ఇవెప్పుడు వస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం :