మహేష్ క్రేజీ ప్రాజెక్ట్ పై వైరల్ అవుతున్న సాలిడ్ బజ్.!

Published on May 19, 2022 3:00 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దీనితో తన కెరీర్ లో మరో హిట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత మహేష్ తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ తో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి కూడా తెలిసిందే.

అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో సాలిడ్ బజ్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో గత కొంత కాలం నుంచి మరో హీరో కూడా కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఈ టాక్ ప్రకారం అయితే ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో మరో హీరోగా నాచురల్ స్టార్ నాని పేరు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

అయితే ఇంకా దీనిపై మాత్రం ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉందట. ఇక ఈ సినిమాకి కూడా థమన్ సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే హారికా హాసిని వారు భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ స్కేల్ లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :