“హరిహర వీరమల్లు” షూట్ పై లేటెస్ట్ సాలిడ్ అప్డేట్.!

Published on May 27, 2022 9:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమా “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాపై గత కొన్ని రోజులు నుంచి కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తూ వచ్చాయి. దీనితో ఇప్పుడు అయితే ఈ సినిమా పై లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తోంది.

దీని ప్రకారం అయితే మేకర్స్ అయితే నెక్స్ట్ షెడ్యూల్ ని ఈ జూన్ 7 నుంచి స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నారట. దీనితో ఈ సినిమా పై రూమర్స్ కి ఒక చెక్ పడినట్టే అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :