“హరిహర వీరమల్లు” పై లేటెస్ట్ సాలిడ్ అప్డేట్.!

“హరిహర వీరమల్లు” పై లేటెస్ట్ సాలిడ్ అప్డేట్.!

Published on Nov 17, 2022 10:37 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పవన్ కెరీర్ లో ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతుంది. అలాగే తన నుంచి మొదటి పాన్ ఇండియా భలే బడ్జెట్ ప్రాజెక్ట్ ఇదే కావడంతో మరిన్ని అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి.

రీసెంట్ గా వచ్చిన పవర్ గ్లాన్స్ కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకోగా మంచి బజ్ పాన్ ఇండియా మార్కెట్ లో నమోదు చేసిన ఈ చిత్రం ఇప్పుడు మళ్ళీ షూటింగ్ ని రీ స్టార్ట్ చేసుకుంది. ఇటీవల ఘట్టమనేని వారి ఇంట జరిగిన విషాదంతో షూటింగ్ క్యాన్సిల్ చేయించిన పవన్ ఇప్పుడు మళ్ళీ షూట్ ని రీస్టార్ట్ చేసాడట.

మరి ఇప్పుడు మేకర్స్ అయితే ఓ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ పవన్ పై తెరకెక్కిస్తున్నారట. మరి ఇది సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ అన్నట్టు తెలుస్తుంది. క్రిష్ అయితే చాలా కేర్ తీసుకొని పవన్ మార్క్ లో ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. ఇక ఈ చిత్రానికి అయితే ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ఖర్చుకి వెనకాడకుండా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు