లేటెస్ట్ : “టిల్లు స్క్వేర్” రిలీజ్ పై సాలిడ్ అప్డేట్.!

Published on Nov 30, 2022 9:00 am IST

మన టాలీవుడ్ యంగ్ జెనరేషన్ లో లేటెస్ట్ రైసింగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఒకడు. మరి సిద్ధూ అయితే తన సినిమా కెరీర్ లో “డీజే టిల్లు” తో సాలిడ్ బ్రేక్ తన కెరీర్ లో అందుకోగా నెక్స్ట్ ఇక తాను కూడా యూత్ లో మంచి ఫాలోయింగ్ ని తెచ్చుకున్నాడు. అయితే గత కొన్ని రోజులు నుంచి కొన్ని రూమర్స్ సినిమాపై స్ప్రెడ్ అవుతూ ఉండగా మరోపక్క అయితే సినిమా షూటింగ్ మంచి స్వింగ్ లో గడిచిపోతుంది.

ఇక లేటెస్ట్ గా అయితే సిద్ధూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ అండ్ సాలిడ్ అనౌన్సమెంట్ ని ఐటీ అందించాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చ్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేయగా రూమర్స్ పై కూడా ఓ ప్రెస్ మీట్ ని అతి త్వరలోనే పెట్టి క్లియర్ చేయనున్నట్టుగా సాలిడ్ అప్డేట్స్ ని అయితే ఈ యంగ్ హీరో ఇచ్చాడు. మరి ఇందులో ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :