లేటెస్ట్ స్టిల్స్ : మెగాస్టార్ తో మెహర్ రమేష్

Published on May 4, 2023 1:34 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్. ఈ మూవీలో మెగాస్టార్ కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థల పై నిర్మితం అవుతున్న భోళా శంకర్ మూవీ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 11 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ని కోల్కతా లో నిర్వహించనున్నారు.

రేపటి నుండి ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అక్కడికి స్పెషల్ ఫ్లైట్ లో చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక మెగాస్టార్ తో పాటు మెహర్ రమేష్ కోల్కతా చేరుకున్న పిక్స్ కొద్దిసేపటి క్రితం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన అభిమాన మెగాస్టార్ తో తెరకెక్కిస్తున్న భోళా శంకర్ తప్పకుండా అందరి అంచనాలు అందుకుంటుందని మెహర్ రమేష్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :