లేటెస్ట్..భవ్య క్రియేషన్స్ తో సుధీర్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్!

Published on Feb 12, 2022 12:02 pm IST


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి నటులలో మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సనాలిటీస్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు కూడా ఒకడు. ఒక సినిమా కోసం తనని తాను ఎంతవరకు అయినా కష్టపెడతాడు. అలాగే ఇంకో రకంగా చెప్పాలి అంటే మాంచి స్టన్నింగ్ పర్సనాలిటీ ఉన్న అండర్ రేటెడ్ హీరో తాను అని చెప్పాలి.

మరి సుధీర్ బాబు కి సరైన యాక్షన్ సినిమా పడితే ఎలా ఉంటుందో ఇది వరకు చాలా సినిమాల్లోనే చూసాము. కానీ వీటన్నిటినీ మించే భారీ యాక్షన్ థ్రిల్లర్ తో ఇప్పుడు సుధీర్ బాబు రెడీ అవుతున్నాడు. తన కెరీర్ లో 16వ సినిమాగా యంగ్ టాలెంట్ మహేష్ సురపనేని దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ లో నిర్మాణం వహిస్తున్నట్టు ఇపుడు అనౌన్స్ చేశారు.

మరి ఈ అనౌన్సమెంట్ పోస్టర్ తోనే మంచి హైప్ ని కూడా లేపారు. కంప్లీట్ గా ఒక మెషిన్ గన్స్ సెటప్ ని చూపిస్తూ ఈ సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే దానికి అర్ధం వచ్చేలా టీజ్ చేశారు. ఇక ఈ చిత్రంపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :