లేటెస్ట్.. సూర్య “జై భీమ్” కి మరో ఘనత.!

లేటెస్ట్.. సూర్య “జై భీమ్” కి మరో ఘనత.!

Published on Jul 29, 2022 7:30 PM IST

గడిచిన రెండేళ్లలో కూడా ఓటిటి లో చాలా సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చాయి. మరి ఈ అన్ని ఎన్నో చిత్రాల్లో మాత్రం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రెండు చిత్రాలు “ఆకాశం నీ హద్దురా”, “జై భీమ్” లు ఎన్నెన్నో అరుదైన ఘనతలను అనేక సందర్భాల్లో అందుకున్నాయి. అంతే కాకుండా కొన్ని రోజులు కితమే ఆకాశమే నీ హద్దురా అనేక నేషనల్ అవార్డులు వరించగా తాజాగా సూర్య మరో ఎమోషనల్ హార్డ్ హిట్టింగ్ హిట్ సినిమా “జై భీమ్” మరో అరుదైన ఘనత అందుకున్నట్టుగా తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని లేటెస్ట్ గా ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ స్పెషల్ స్క్రీనింగ్ గా ప్రదర్శితం చేయనున్నారట. దీనితో సూర్య ఖాతాలో మరో అరుదైన ఘనతను అందుకుంది అని కోలీవుడ్ సహా అన్ని సినీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ చిత్రంలో మణికందన్, లిజోమోల్ జోస్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా టీజె జ్ఞ్యానవేల్ దర్శకత్వం వహించారు. అలాగే సూర్య ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు