లేటెస్ట్..మారిపోయిన ‘భీమ్లా’, ‘సర్కారు వారి’ డేట్స్.?

Published on Oct 2, 2021 5:30 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులు హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రాలు “భీమ్లా నాయక్”, “సర్కారు వారి పాట”. జెనరల్ గా ఈ ఇద్దరి హీరోల సినిమాలు అంటేనే ఇండస్ట్రీలో పోటాపోటీ.. అలాంటిది ఒకే ఏడాది ఒక్కరోజు తేడాతో రెండు సినిమాలు వస్తున్నాయి అంటే అది మూవీ లవర్స్ కి సిసలైన పండుగ.

అలా ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12, 14 తేదీలకు ఆల్రెడీ ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పరిస్థితులు శరవేగంగా మారుతుండడంతో కొత్త రిలీజ్ డేట్స్ ఈ సినిమాలకి వచ్చినట్టు బజ్ వినిపిస్తుంది. మేకర్స్ అప్పుడుకప్పుడు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తున్నా చివరి నిమిషంలో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి.

అందులో భాగంగానే భీమ్లా నాయక్ సినిమా మార్చ్ నెలాఖరుకి ఫిక్స్ కాగా సర్కారు వారి పాట మాత్రం ఏప్రిల్ నెల చివరికి షిఫ్ట్ అయ్యిపోయినట్టుగా తెలుస్తుంది. మరి వీటిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. రీసెంట్ గానే భీమ్లా నాయక్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మరి ఈ సినిమాల విషయంలో ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :