“దసరా” ప్రీ రిలీజ్ పై లేటెస్ట్ టాక్.!

Published on Mar 19, 2023 5:07 pm IST


నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “దసరా”. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ ప్రమోషన్స్ చేస్తున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ లో మరింత ఆసక్తి అలా పెరుగుతూ వెళ్తుంది. మరి దసరా ప్రమోషన్స్ లో ఈరోజు యూనిట్ వైజాగ్ లో సందడి చేయగా ఇక సినిమా నెక్స్ట్ కీలక స్టెప్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి సాలిడ్ బజ్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది.

మరి దీని ప్రకారం అయితే ఈ మార్చ్ 25 నుంచి 27 డేట్స్ లో ఏదొక డేట్ కి ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కి అయితే సంతోష్ నారాయణన్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ అందించగా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ వ్యయంతో ఈ సినిమాని నిర్మాణం వహించారు. అలాగే పాన్ ఇండియన్ లెవెల్లో మార్చ్ 30 గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :