టాక్..ఎన్టీఆర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోలేదా..?

Published on Jun 4, 2022 3:00 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇప్పుడు తాను చేసిన భారీ “రౌద్రం రణం రుధిరం” తర్వాత కన్నా తన ఎన్టీఆర్ 30 తో తెచ్చుకున్న హైప్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. కొరటాల శివతో చేస్తున్న సినిమా నుంచి మోషన్ పోస్టర్ టీజర్ కి పాన్ ఇండియా లెవెల్ ఆడియెన్స్ ఊహించని రేంజ్ ఫీల్ ని ఎంజాయ్ చేసారు. దీనితో పాటుగా ప్రశాంత్ నీల్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రామిసింగ్ హైప్ ని తన ఫ్యాన్స్ కి ఇచ్చాడు.

అయితే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వచ్చిన ఈ అప్డేట్స్ తో పాటు మరో దర్శకుడు బుచ్చిబాబు సాన తో ఓ సినిమా ప్లాన్ చెయ్యగా దానిపై కూడా అప్డేట్ వస్తుందని ఆశించారు. కానీ దాని నుంచి అనౌన్స్మెంట్ రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయినట్టే అని టాక్ వచ్చింది. కానీ లేటెస్ట్ సమాచారం ఏమిటంటే ఈ సినిమా ఆగిపోలేదట. ఈ సినిమా ఉందని తెలుస్తుంది. అలాగే దీనిని కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే చేస్తున్నారని టాక్.

సంబంధిత సమాచారం :