“భీమ్లా నాయక్” టీజర్ పై ఆసక్తి.. కానీ ఛాన్స్ లేదా.?

Published on Jan 4, 2022 2:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమాల్లో “భీమ్లా నాయక్” కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసేసుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ పట్ల ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుని ఫిబ్రవరి కి షిఫ్ట్ అయ్యింది.

మరి మళ్ళీ సంక్రాంతి రేస్ లో రిలీజ్ అని టాక్ వచ్చినా దీనిలో ఎలాంటి నిజం లేదు ఆ పరిస్థితులు కూడా లేవని అందరికీ ఒక క్లారిటీ కూడా వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుంచి అవైటెడ్ టీజర్ కట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీనిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

ప్లాన్ ప్రకారం ఫిబ్రవరిలోనే ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ఉంటే టీజర్ సంక్రాంతికే రావచ్చని టాక్. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఒకవేళ మళ్ళీ కరోనా ప్రభావం పెరిగేలా చేస్తే అనే ప్రశ్న కూడా వస్తుంది. దీనితో భీమ్లా నాయక్ టీజర్ రిలీజ్ పై క్లారిటీ కి ఇంకా కొన్ని రోజులు పరిస్థితులే డిసైడ్ చెయ్యాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :