టాక్.. మహేష్ – త్రివిక్రమ్ భారీ ప్రాజెక్ట్ రిలీజ్ ప్లాన్ రెడీ.?

Published on Jun 22, 2022 3:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “సర్కారు వారి పాట” హిట్ తో మహేష్ ఇపుడు ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ముగిసాక మహేష్ వచ్చి రావడంతోనే తన దర్శకుడు త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాని మహేష్ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తుండగా ఈ సినిమాతోనే మహేష్ ఫస్ట్ టైం పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అయితే ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వని సినిమాకి అప్పుడే రిలీజ్ టైం ని టార్గెట్ పెట్టేసుకున్నట్టుగా తెలుస్తుంది. మేకర్స్ అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కానుకగా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి అయితే మేకర్స్ మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :