టాక్.. “RRR” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..?

Published on Apr 20, 2022 8:53 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” సినిమా కోసం అందరికీ తెలిసిందే. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ప్రస్తుతం థియేటర్స్ లో ఇంకా మంచి రన్ ని కొనసాగిస్తోంది.

మరి ఈ థియేట్రికల్ రన్ తర్వాత అంతా ఎంతో ఆసక్తిగా ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ5 వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇందులో ఎప్పుడు నుంచి అందుబాటులోకి వస్తుందో డేట్ తెలుస్తుంది.

లేటెస్ట్ బజ్ ప్రకారం అయితే ఈ సినిమా జూన్ 3 నుంచి జీ5 లో భాషల్లోని స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తుందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందివ్వగా డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :