టాక్..”RRR” టీజర్ బ్లాస్ట్ కి టైం దగ్గర పడిందా?

Published on Oct 14, 2021 3:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవారిలోకి ఫిక్స్ అయ్యింది. అయితే ఈ చిత్రం రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండడంతో మరిన్ని సాలిడ్ అప్డేట్స్ రావడానికి సిద్ధం అవుతున్నాయి.

అయితే ఇప్పుడు తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఈ సినిమాపై వినిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చరణ్, ఎన్టీఆర్ లపై సెపరేట్ టీజర్స్ చూసాం కానీ ఇద్దరికీ కలిపి ఒకటి కూడా చూడలేదు. మరి అలాంటి టీజర్ ని మేకర్స్ వచ్చే దీపావళి కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉందని బజ్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో అన్నది వేచి చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :