టాక్..మహేష్ 28 రిలీజ్ పై సరికొత్త మాటలు..!

Published on Mar 19, 2023 8:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల మరియు పూజా హెగ్డే లు హీరోయిన్ లుగా దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా కోసం ఇప్పుడు తెలిసిందే. భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని మేకర్స్ శరవేగంగా తెరకెక్కిస్తుండగా ఆల్రెడీ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాని ఆగస్ట్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నామని కన్ఫర్మ్ చేశారు.

అయితే ఇప్పుడు రిలీజ్ విషయంలో సరికొత్త మాటలు అయితే వినిపిస్తున్నాయి. బహుశా సినిమా ఆగస్ట్ రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువే ఉన్నాయి అని కానీ మేకర్స్ టార్గెట్ ఆగస్టు అయినప్పటికీ సినిమా అయితే వచ్చే ఏడాదికి వెళ్లిపోవచ్చని నయా బజ్. దీనితో అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మహేష్ ఫ్యాన్స్ కాస్త తక్కువ ఎగ్జైట్మెంట్ ని హోల్డ్ చేసుకుంటే మంచిది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అలాగే హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :