లేటెస్ట్..సూర్య సాలిడ్ హిట్ రీమేక్ కి ఈ బాలీవుడ్ స్టార్ ఫిక్స్.!

Published on Jan 29, 2022 11:05 am IST


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసాడు.. ఒక్క తన సినిమాల కాన్సెప్ట్ లతోనే కాకుండా సూర్య తన అద్భుతమైన నటనతో చేసే మ్యాజిక్ కూడా ఇంకో లెవెల్లో ఉంటుంది అందుకే మూవీ లవర్స్ తన సినిమాల్లో కంటెంట్ తో పాటుగా తన విలక్షణమైన నటనను కూడా ఎంతగానో కోరుకుంటారు.

అలా ఈ రెదను కలగలిపి చేసిన తాజా చిత్రాలే రెండు బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ అయ్యాయి. అవే “ఆకాశం నీ హద్దురా” మరియు “జై భీమ్”. ఈ రెండు సినిమాలు కూడా ఓటిటి లో వచ్చినా సూపర్ హిట్ అయ్యి ఆస్కార్ వరకు వెళ్లాయి. మరి వీటిలో లేడీ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన ఆకాశం నీ హద్దురా ని హిందీలో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారని ఎప్పుడు నుంచో టాక్ ఉండగా ఇప్పుడు లేటెస్ట్ గా దీనిపై క్లారిటీ వచ్చింది.

మరి ఈ చిత్రాన్ని హిందీలో ఈమెనే డైరెక్ట్ చేస్తుండగా అక్కడి స్టార్ట్ హీరో అయినటువంటి అక్షయ్ కుమార్ ఫైనల్ అయ్యినట్టుగా బాలీవుడ్ వర్గాలు ఈరోజు కన్ఫర్మ్ చేసాయి. అలాగే కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని హిందీలో తెరకెక్కించనున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :