లేటెస్ట్.. కరోనా నుంచి కోలుకున్న ఈ స్టార్ హీరోయిన్.!

Published on Jan 12, 2022 10:02 am IST

ఈ కొత్త ఏడాది స్టార్ట్ అవుతుండడంతోనే ఊహించని విధంగా భారతదేశంలో కరోనా కేసులు ఎలా పెరుగుతూ వచ్చాయో చూసాం. రోజురోజుకి భారీ స్థాయిలో పెరుగుతూ వస్తున్న ఈ కేసులు ఒకెత్తు అయితే ఈ మూడో వేవ్ కారణంగా అనేక మంది సినిమా ప్రముఖులు అందులోని మన దక్షిణాది సినిమా నుంచే పాజిటివ్ కావడం కాస్త కలకలం రేపింది. మరి కరోనా వల్ల పాజిటివ్ అయ్యిన స్టార్ నటులలో హీరోయిన్ త్రిష కూడా ఉంది.

కొన్ని రోజులు కితమే త్రిష తనకి పాజిటివ్ వచ్చి చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపింది. మారి ఈరోజు ఉదయం ఒక గుడ్ న్యూస్ ని అయితే షేర్ చేసుకుంది. తాజాగా చేసుకున్న టెస్ట్ లో నేను నెగిటివ్ అయ్యానని. మొదటిసారిగా నెగిటివ్ అయ్యినందుకు సంతోషంగా ఉందని త్రిష తెలిపింది. ఇప్పుడు 2022 సంవత్సరం కోసం రెడీగా ఉన్నానని ఫోటో పెట్టి షేర్ చేసింది.

సంబంధిత సమాచారం :