లేటెస్ట్..బాలయ్య నుంచి బ్లాస్టింగ్ ట్రీట్ కి టైం వచ్చేసింది.!

Published on Jun 9, 2022 8:55 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తన లేటెస్ట్ సినిమా “అఖండ” తో భారీ కం బ్యాక్ ఇవ్వడంతో నెక్స్ట్ సినిమాలపై ఓ రేంజ్ లో హైప్ నెలకొంది. అలా ఇప్పుడు దర్శకుడు గోపీచంద్ మలినేనితో తన కెరీర్ లో మరో సాలిడ్ యాక్షన్ ఎంటెర్టైనర్ ని బాలయ్య చేస్తుండగా మరి ఈ జూన్ లో బాలయ్య బర్త్ డే కానుకగా ఒక అదిరిపోయే బర్త్ డే ట్రీట్ ని అందిస్తున్నట్టుగా మేకర్స్ రీసెంట్ గానే మాసివ్ అనౌన్సమెంట్ ఇవ్వగా ఒక్కసారిగా భారీ హైప్ సెట్ అయ్యింది.

మరి దానిని అంతే స్థాయిలో నిలుపుతూ మేకర్స్ ఆ బ్లాస్టింగ్ ట్రీట్ ని రివీల్ చేశారు. ఈ సినిమా నుంచి మాసివ్ టీజర్ ను ఈరోజు సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టుగా క్రేజీ అనౌన్సమెంట్ ఇచ్చారు. మరి ఇందులో పులిచర్ల అనే మైలురాయి, దానిపై రక్తం, పక్కనే గొడ్డలి చూస్తూనే భారీ యాక్షన్ సీక్వెన్స్ పై ఉంటుందని అర్ధం అవుతుంది. మొత్తానికి అయితే ఈ మాస్ అప్డేట్ మరింత ఆసక్తి పెంచుతుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :