మాస్ బ్లాస్ట్..”మెగా 154″ నుంచి అదిరిన మాస్ గ్లింప్స్.!

మాస్ బ్లాస్ట్..”మెగా 154″ నుంచి అదిరిన మాస్ గ్లింప్స్.!

Published on Oct 23, 2022 11:13 AM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు కె ఎస్ రవీంద్ర తెరకెక్కించిన మాస్ మసాలా ఎంటర్టైనర్ కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం అయితే మెగాస్టార్ కెరీర్ లో 154వ సినిమాగా తెరకెక్కుతుండగా టాలీవుడ్ లో దీనిపై అయితే అనేక అంచనాలు సెట్టయ్యాయి.

ఇక గత కొన్ని రోజులు నుంచి అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ టైటిల్ ని మేకర్స్ ఈ అక్టోబర్ 24 న అనౌన్స్ చేస్తున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. మరి దీనిపై అయితే ఓ సాలిడ్ మాస్ క్లిప్ ని రిలీజ్ చేశారు వింటేజ్ మెగాస్టార్ ని చూపిస్తూ బాస్ స్వాగ్ తో మాస్ గా కట్ చేసిన ఈ క్లిప్ తో రేపు అక్టోబర్ 24 ఉదయం 11 గంటల 7 నిమిషాలకి దీపావళి బ్లాస్ట్ గా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు. మరి ఈ అవైటెడ్ టైటిల్ ఏంటో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు