టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఈ అక్టోబర్ నెలలో విడుదలకి సిద్ధంగా ఉంది.
అయితే ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. సినిమా తాలూకా టీజర్ ని విడుదల చేస్తున్నట్టుగా ఓ ఇంటెన్స్ పోస్టర్ తో రేపు సెప్టెంబర్ 12 మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని ఫిక్స్ చేశారు. మరి ఈ టీజర్ తో సినిమాపై ఓ క్లారిటీ రావచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 2న గ్రాండ్ గా విడుదలకి రానుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన వెంకీ మామ, పైగా త్రివిక్రమ్ కలయిక కావడంతో ఆడియెన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
