లేటెస్ట్..”భోళా శంకర్” మాస్ బీట్ కి టైం ఫిక్స్.!

Published on Jun 4, 2023 10:15 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తో అయితే మాస్ డ్రామా “భోళా శంకర్” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి మేకర్స్ అయితే రీసెంట్ గానే వరుస అప్డేట్స్ ని స్టార్ట్ చేయగా మొదట భోళా మ్యూజికల్ ఫెస్ట్ ని అయితే స్టార్ట్ చేశారు. మరి మొన్ననే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమో ని రిలీజ్ చేయగా ఈ ఫస్ట్ సింగిల్ ఫుల్ సాంగ్ ని ఈరోజు మేకర్స్ రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సాంగ్ కి అయితే ఇప్పుడు మేకర్స్ టైం లాక్ చేసారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి అయితే ఈ మాస్ బీట్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి అయితే మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కీర్తి సురేష్ చిరు కి సోదరి పాత్రలో నటిస్తుంది. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :